కోటపల్లి మండలం నార్వాయిపేట అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగల అమర్చిన వేటగాళ్లు నప్ప సురేష్, దుర్గం శంకర్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు అటవీ శాఖ రేంజర్ సదానందం తెలిపారు. ఈనెల 15న వన్యప్రాణులకు వేట కోసం విద్యుత్ తీగల అమర్చగా.. వారిని పట్టుకుని శుక్రవారం కేసు నమోదు చేసినట్లు వివరించారు. 12 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పును వెలువరించినట్లు పేర్కొన్నారు.