ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన ప్రొఫెసర్ కోదండరాంను తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ముఖ్య భూమిక పోషించిన కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు