మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మంగళవారం మున్సిపల్ ఆఫీస్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందించారు. మున్సిపాలిటీ ఎన్నికల సమస్యను ప్రభుత్వం పట్టించుకోవాలని వెంటనే ఎన్నికలు జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.