మందమర్రి పట్టణంలోని సింగరేణి ఉద్యోగుల గృహాలను శనివారం అధికారులు సందర్శించారు. వారి గృహాల్లో పెంచుతున్న మొక్కలు, ఇంటిని అలంకరించుకున్న విధానాన్ని పరిశీలించారు. సింగరేణి ఆవిర్భావ సందర్భంగా ఈ గృహాలను సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఉత్తమ గృహాల ఎంపికలో భాగంగానే తాము సందర్శించినట్లు తెలిపారు. ఎంపికైన వారికి జీఎం చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.