చెన్నూర్ నియోజకవర్గం మందమర్రి పట్టణం గాంధీ నగర్ చెందిన జీవన్, కీర్తి దంపతుల తొమ్మిది నెలల కుమారుడు జాన్సన్ పాము కాటుకు గురైయ్యాడు. ఆరు రోజులుగా మృత్యువు తో పోరాడిన చిన్నారి జాన్సన్ ఆదివారం మృతి చెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.