మంచిర్యాల జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో 805 ఎకరాల్లో పత్తి, వరి పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక సర్వేలో గుర్తించారు. జన్నారంలోని నాలుగు గ్రామాల్లో 30 మంది రైతులకు చెందిన 40 ఎకరాల పత్తి, 110 మందికి చెందిన 165 ఎకరాల వరి, చెన్నూర్ మండలంలో సుందరశాల గ్రామంలో 30 మందికి చెందిన 100 ఎకరాల పత్తి, మంచిర్యాలలో రెండు గ్రామాల్లో 73 మందికి చెందిన 200 ఎకరాల పత్తి పంటకు నష్టం వాటిల్లింది.