జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను బుధవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా నిర్వహించుకున్నారు. మహాత్మా గాంధీ చిత్ర పటానికి రామగుండం సిపి శ్రీనివాస్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, అహింసావాది మహాత్మా గాంధీ మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని ఆయన పేర్కొన్నారు. జాతిపిత దేశానికి చేసిన సేవలను కొనియాడారు.