గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

85చూసినవారు
గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
తాండూరు మండలంలో ఈ నెల 15, 16 తేదీల్లో గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సిఐ కుమారస్వామి సూచించారు. శుక్రవారం నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గణేష్ శోభాయాత్ర సందర్భంగా ట్రాక్టర్ డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలను నడపరాదని, క్రమ పద్ధతిలో నెమ్మదిగా, జాగ్రత్తగా నడపాలన్నారు. డీజే పూర్తిగా నిషేధమని, సాంప్రదాయ, సాంస్కృతిక నృత్యాలు, భజన సంకీర్తనలతో ముందుకు సాగాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్