రవాణా శాఖ కమిషనర్ ఇలంబరిదిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారిగా నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల, ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్ జిల్లాలకు ఆయన ప్రత్యేకాధికారిగా నియమించారు. జిల్లాల్లో పర్యటించడంతోపాటు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించాలని ఆయనకు సూచించారు.