మంచిర్యాల తాసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు 18 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద యువతులకు కళ్యాణ లక్ష్మి పథకం వరం లాంటిదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్ద పీఠ వస్తుందని ఆయన వెల్లడించారు.