మంచిర్యాల పట్టణం గోదావరి తీరిన ఉన్న శ్రీ గౌతమేశ్వర ఆలయం వద్ద నవగ్రహాల విగ్రహాల ప్రతిష్ట మహోత్సవంలో మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదివారం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.