ప్రజల హక్కులు నిలబడాలంటే భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని సామాజిక న్యాయవేదిక కన్వీనర్ రంగు రాజేశం అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ సంబరాలలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని బలహీనపరచాలని చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు దాగం శ్రీకాంత్, కార్యదర్శి ఈదునూరి అభినవ్ పాల్గొన్నారు.