నస్పూర్: ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద పిచ్చి మొక్కలు, చెట్లు తొలగింపు

64చూసినవారు
నస్పూర్: ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద పిచ్చి మొక్కలు, చెట్లు తొలగింపు
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద చెట్లు పెరిగి ప్రమాదకరంగా మారాయి. దీంతో వార్డు కౌన్సిలర్ పూదరి కుమార్ గురువారం చెట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. మున్సిపల్ సిబ్బందితో ట్రాన్స్‌ఫార్మర్ల పరిసరాల్లో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, చెట్లను తొలగించి శుభ్రం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వార్డులో సమస్యల పరిష్కారానికి ఎప్పటికపుడు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్