గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నస్పూర్ మండల కేంద్రంలోని ప్రశాంతి నగర్ లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గణనాధునికి 108 రకాల నైవేద్యాలు సమర్పించి భక్తులు తమ భక్తిపారవశాన్ని చాటుకున్నారు. పిండి వంటలు, తీపి పదార్థాలు, పండ్ల రకాలతో కలిసి 108 నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.