బెల్లంపల్లి పట్టణంలోని శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ బొంకూరి శ్రీనివాస్ తెలిపారు. 33/11 కేవీ సబ్ స్టేషన్ లో కొత్తగా 5. 0 ఎంవీఏ పీటీఆర్ అమర్చనున్నందున ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు బజారు ఏరియా, రోడ్ నంబర్ 2, 3, 4, కన్నాల, పోస్టాఫీస్, గ్రౌండ్ బస్తీలు, పెద్దనపల్లి, కాల్ టెక్స్, గాంధీనగర్, గంగరాంనగర్, టేకుల బస్తి ఏరియాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు.