విద్యుత్ ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించాలి

58చూసినవారు
విద్యుత్ ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించాలి
విద్యుత్ ప్రమాదాల నివారణకు వినియోగదారులు, రైతులు జాగ్రత్తలు పాటించాలని మంచిర్యాల విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రావణ్ కుమార్ సూచించారు. వర్షం పడుతున్నప్పుడు రైతులు నీటితో తడిసిన చేతులతో విద్యుత్ సరఫరా చేసే పరికరాలు స్తంభాలను ఆన్, ఆఫ్ స్విచ్ లను తాకవద్దని పేర్కొన్నారు. పంటల రక్షణకు పొలం చుట్టూ కంచెకు కరెంటును వినియోగించవద్దని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే స్థానిక విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్