ఎస్సీ వర్గీకరణ తీర్పును సుప్రీంకోర్టు పునరాలోచించాలని కోరుతూ తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో మంచిర్యాలలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు మద్దతుగా జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టామన్నారు. మాల మహానాడు నాయకులు, తదితరులు ఉన్నారు.