సికింద్రాబాద్, నాగపూర్ మధ్య నేడు ప్రారంభమైన వందే భారత్ రైలు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్ట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారస్తులు స్థానిక రైల్వే స్టేషన్ లో నిరసన తెలిపారు. వారి నిరసనకు బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఏ గ్రేడ్ రైల్వే స్టేషన్ అయినప్పటికీ ప్రధాన రైలు ఆగకపోవడంతో దూరప్రాంత ప్రయాణికులు, వ్యాపారస్తులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.