అంగన్ వాడీ కేంద్రంలో రీడ్ ఏ థాన్ కార్యక్రమం

58చూసినవారు
అంగన్ వాడీ కేంద్రంలో రీడ్ ఏ థాన్ కార్యక్రమం
పోషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మంచిర్యాలలోని క్యాబిన్ ఏరియా అంగన్ వాడీ కేంద్రంలో రీడ్ ఏ థాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్ వాడీ టీచర్ పద్మజ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్ వైజర్ జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులతో అరగంట పాటు సామూహిక పుస్తక పఠనం చేశారు. అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్య అందిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్