రాంచెరువు సుందరీకరణలో నిర్లక్ష్యం వీడాలి

64చూసినవారు
రాంచెరువు సుందరీకరణలో నిర్లక్ష్యం వీడాలి
మంచిర్యాల పట్టణంలోని రాంచెరువు సుందరీకరణ పనులు చేపట్టడంలో అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకులు తుల మధుసూదన్ రావు ఆరోపించారు. శుక్రవారం వివిధ సంఘాల నాయకులతో కలిసి ఆయన రాంచెరువును సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ. 2 లక్షల వ్యయంతో నాణ్యత పాటించకుండా చెరువు మత్తడి నిర్మించారని తెలిపారు. వెంటనే చెరువు పరిరక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్