ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సర్వేను పరిశీలించిన ఎంపీఓ

77చూసినవారు
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సర్వేను పరిశీలించిన ఎంపీఓ
జైపూర్ మండలంలోని జైపూర్, వెంకట్రావుపల్లి, నర్వ గ్రామ పంచాయతీలను మంగళవారం మండల పంచాయతీ అధికారి శ్రీపతి వాపురావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న ఎల్ఆర్ఎస్ కింద సమర్పించిన దరఖాస్తుల సర్వేను పరిశీలించారు. నిర్దేశిత లక్ష్యం ప్రకారం సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయితీ కార్యదర్శులకు సూచించారు.

సంబంధిత పోస్ట్