బస్సులో పోగొట్టుకున్న బంగారు నగలతో కూడిన బ్యాగును కనుక్కొని బాధితురాలికి మంచిర్యాల పోలీసులు అందజేశారు. సీఐ బజ్జిలాల్ తెలిపిన వివరాల ప్రకారం. జగిత్యాల నుంచి ఇందారంలోని బంధువుల ఇంటికి వెళ్లడానికి మంచిర్యాలకు వచ్చిన సోనియా అనే మహిళ బస్సు దిగే సమయంలో బ్యాగు మర్చిపోయింది. వెంటనే బ్లూ కోల్డ్ సిబ్బంది సీసీ కెమెరాలను పరిశీలించి రైల్వే స్టేషన్లో బ్యాగును గుర్తించి బాధితురాలికి అందజేశారు.