పాఠశాలలో వంట సరుకులు చోరీ

54చూసినవారు
పాఠశాలలో వంట సరుకులు చోరీ
దహెగాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వంట సరుకులు చోరీకి గురైనట్లు మధ్యాహ్న భోజన కార్మికులు పద్మ, వెంకటమ్మ, లక్ష్మి తెలిపారు. మంగళవారం పాఠశాలకు వెళ్లగా వంటగది తలుపులు పగులగొట్టి ఉన్నాయన్నారు. లోపలికి వెళ్లిచూడగా బియ్యం, పప్పులు, కోడిగుడ్లు, తదితర సరుకులు మాయమైనట్లు గుర్తించారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్