తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు అరెస్ట్

63చూసినవారు
తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు అరెస్ట్
నాన్ బెయిలబుల్ వారెంట్ కలిగి కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ సీఐ రాజమౌళి గౌడ్ తెలిపారు. 2018లో రామిళ్ల మానస అనే వివాహిత భర్త ప్రసాద్, అత్త రాజమ్మ వరకట్నం కోసం వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. నిందితులు ఆరేళ్లుగా కోర్టుకు హాజరుకాక పోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కాగా బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

సంబంధిత పోస్ట్