రిటైర్డ్ సింగరేణి కార్మికుడు మృతి
మందమర్రి పట్టణంలోని రాజీవ్ నగర్ కి చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి చిన్నయ్య (70) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల చిన్నయ్య తాగుడుకు బానిస అయ్యాడు. తన ఇద్దరు కొడుకులు ఎలాంటి పనులు లేక తన కుటుంబం ఆర్థికంగా కష్టాల్లో ఉందని మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక ఎస్సై రాజశేఖర్ సోమవారం విలేకరులకు తెలిపారు.