మంచు ఫ్యామిలీలో వివాదం నేపథ్యంలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ జల్పల్లిలోని మంచు మనోజ్ ఇంటికి అన్న మంచు విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ వెళ్లారు. అక్కడి సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నారు. మనోజ్ ఇంటి దగ్గ ప్రైవేట్ బౌన్సర్లను కాపలాగా పెట్టారు. దుబాయ్ నుంచి HYD చేరుకున్న మంచు విష్ణు కాసేపట్లో తమ్ముడి ఇంటికి వెళ్లనున్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.