వైఎస్ జగన్- భారతి మధ్య విభేదాలు ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బాంబు పేల్చారు. విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి వైదొలిగిన అంశంపై మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ తప్పుల మీద తప్పులు చేస్తుంటే తట్టుకోలేక విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి బయటకి వచ్చారని పేర్కొన్నారు. వైసీపీ లాంటి నీచమైన పార్టీ ఉండకూడదని అన్నారు. జగన్- భారతి మధ్య కూడా విభేదాలు ఉన్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు.