AP: హోం మంత్రి అనిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. ఆమె రీల్స్ చూసుకోవడం బెటర్ అని ఎద్దేవా చేశారు. ‘అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 8 నెలలైనా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. వాలంటీర్లను తొలగించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు 4 నెలలుగా జీతాల్లేవు. పెట్టుబడులు తెచ్చామన్నారు.. కానీ 8 నెలల్లో ఒక్క రూపాయి కూడా తేలేదు. మీరు తీసుకొచ్చింది పీఎం మోడీని’ అని ఆరోపించారు.