దాడిపై స్పందించిన మణిపూర్ సీఎం

65చూసినవారు
దాడిపై స్పందించిన మణిపూర్ సీఎం
ఇటీవల తన కాన్వాయ్‌పై జరిగిన దాడిపై మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ స్పందించారు. రాష్ట్రంలో భద్రతా సవాళ్లను, శాంతిని పూర్తిగా పునరుద్ధరించడానికి రాజకీయ చర్చల అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇదో అవమానకరమని ఘటనగా పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఇంఫాల్‌లో మీడియాతో మాట్లాడారు. నా సొంత రాష్ట్రంలోనే భద్రతా కాన్వాయ్‌పై దాడి జరగడం సిగ్గుచేటుగా భావిస్తున్నట్టు తెలిపారు. ఈ దాడికి సంబంధించి ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్