మహేశ్‌ జుట్టులాగి ఆటపట్టించిన మంజుల

559చూసినవారు
హీరో మహేశ్‌బాబు కనిపిస్తే చాలు సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు అందరూ తెగ ఆసక్తి చూపిస్తారు. తాజాగా ఓ వేడుకకు హాజరైన ఆయనను సరదాగా ఆటపట్టించారు ఆయన సోదరి మంజుల. హైదరాబాద్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకకు కుటుంబ సమేతంగా వెళ్లగా, ఆ కార్యక్రమానికి వచ్చిన మంజుల నేరుగా మహేశ్‌బాబు దగ్గరకు వెళ్లారు. వెంటనే ఆయన జుట్టు పట్టుకుని లాగడం, అందుకు మహేశ్‌ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

సంబంధిత పోస్ట్