కంప్యూటర్ల ముందు కూర్చుని గంటల తరబడి పనిచేసే వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. ఇలా ఎక్కువ సమయం పనిచేయడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే పాడుచేసుకుంటున్నాం. వెన్నుముకపై ఒత్తిడి, మెడ నొప్పి, ఒబేసిటీ సమస్య, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలా కాకుడదంటే ప్రతి అరగంటకు 5 నిమిషాలు విరామం తీసుకోవాలి. క్వాలిటీ కుర్చీలో కూర్చోవడంతో పాటు కాళ్లు నేలను తాకేలా కూర్చుంటే సమస్యల నుంచి కొద్దిగా రక్షించుకోవచ్చు.