వధువు పీటల మీద కూర్చుని పెళ్లి కార్యక్రమాలు పూర్తి చేస్తుండగా ఓ కుక్క పెళ్లి మండపంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించింది. వేదిక మీదకు ఎక్కి వధువును భయపెట్టింది. అరుచుకుంటూ ఆమె మీదకు వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో భయపడిన వధువు కేకలు వేసుకుంటూ అటూ ఇటూ పరుగులు పెట్టింది. ఎంతో అందంగా అలంకరించిన మండపం ఆ హడావుడిలో ధ్వంసమైంది. దీనికి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.