AP: కాకినాడ జిల్లా జగ్గంపేటలో విషాదం చోటు చేసుకుంది. రామవరం గ్రామానికి చెందిన స్వాతి (26) సురేశ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి కొడుకు (4), కూతురు (8 నెలలు) ఉన్నారు. సురేశ్ మద్యానికి బానిసయ్యాడు. దాంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. భర్తతో విసిగిపోయిన స్వాతి పిల్లల కోసం కట్టిన ఉయ్యాల తాడుతోనే ఉరేసుకున్నారు. ఇద్దరు చిన్నారులు తల్లిని కోల్పోయారు. స్వాతి మృతితో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.