వాహన ధరల్ని తగ్గించిన మారుతీ సుజుకీ.. ఎంతంటే?

53చూసినవారు
వాహన ధరల్ని తగ్గించిన మారుతీ సుజుకీ.. ఎంతంటే?
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ.. తన కార్ల ధరను తగ్గిస్తూ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఆటో గేర్‌ షిఫ్ట్‌ (AGS) వాహనాలకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుందని తెలిపింది. ఈరోజు నుంచే ధర తగ్గింపు అమల్లోకి వచ్చిందని కంపెనీ తన ఎక్ఛేంజ్‌ ఫైలింగ్‌లో తెలిపింది. తగ్గింపు ప్రకటించిన వాహనాల్లో ఆల్టో కె10, S-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్-ఆర్, స్విఫ్ట్, డిజైర్, బాలెనో, ఫ్రాంక్స్, ఇగ్నిస్ ఉన్నాయి. ఈ మోడళ్లు రూ.5 వేల తగ్గింపు ధరతో లభించనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్