ఎన్నికల్లో తొలిసారి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారు. వయనాడ్ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నట్లు ఏఐసీసీ ప్రకటించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజీనామాతో వయనాడ్ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. రెండు చోట్ల గెలవడంతో వయనాడ్‌కు రాహుల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ స్థానం నుంచి ప్రియాంక గాంధీ బరిలో దిగనున్నారు.