చిలీలోని కలమా వద్ద భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదైనట్లు తెలిసింది. దీంతో ఆ పట్టణానికి 84 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన ఎలాంటి వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా, భారీ భూకంపం సంభవించండంతో స్థానిక ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు.