HYDలో భారీ అగ్నిప్రమాదం

73చూసినవారు
HYDలో భారీ అగ్నిప్రమాదం
HYDలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉన్నట్టుండి నాలుగో అంతస్తులో మంటలు చెలరేగడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం తమ ప్రాణాలను కాపాడుకునేందుకు భయంతో బయటకు పరుగులు తీశారు. ఆఫీసు యాజమాన్యం సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్