ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. కాగా కాసేపట్లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో స్టేడియం వద్దకు అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. అభిమానుల కేరింతలతో ఉప్పల్ స్టేడియం మొత్తం సందడి వాతావరణం నెలకొంది. తొలి మ్యాచ్ లో RR పై SRH తప్పకుండా విజయం సాధిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.