AP: దేశంలో ఐపీఎల్ ఫీవర్ స్టార్ట్ అయింది. శనివారం నుంచి మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. కాగా, ఈ ఏడాది విశాఖ రెండు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. సోమవారం ఢిల్లీ-లక్నో మ్యాచ్ జరగనుంది. రేపు సా.6.30 నుంచి మెగా సెలబ్రేషన్స్‌తో విశాఖలో ఐపీఎల్ సందడి మొదలు కానుంది. రా.7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మేరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.