శ్రీ తేజ్ కోలుకోవాలి.. రేవతి మృతికి ప్రగాఢ సానుభూతి: హరీశ్

79చూసినవారు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ భగవంతుడి దీవెనలతో కోలుకుని మళ్ళీ మామూలు మనిషిలా బయటకు రావాలని BRS తరఫున ప్రార్థిస్తున్నట్లు ఆ పార్టీ నేత హరీశ్ రావు తెలిపారు. ఈ ఘటనలో మరణించిన రేవతి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితులను డాక్టర్లను అడిగి తెలుసుకొని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పినట్లు హరీశ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్