బీఎస్పీ అధినేత్రిగా మాయావతి మరోసారి ఎన్నిక

67చూసినవారు
బీఎస్పీ అధినేత్రిగా మాయావతి మరోసారి ఎన్నిక
బహుజన్‌ సమాజ్‌ పార్టీ (BSP) అధ్యక్షురాలిగా మాయావతి మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు తాజాగా ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, తాను రాజకీయాల నుంచి వైదొలగనున్నట్లు వస్తున్న ప్రచారాన్ని మాయావతి ఖండించారు. తాను క్రియాశీలక రాజకీయాలకు దూరం అవుతున్నాననే వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే(మంగళవారం) ఆమె మరోసారి పార్టీ చీఫ్‌గా ఎన్నికయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్