HYDలోని ఉప్పల్ నల్ల చెరువు పరిశీలించడానికి వచ్చిన GHMC మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కి చేదు అనుభవం కలిగింది. ఉప్పల్లో ఏం పనులు జరగట్లేదని భాగ్య నగర ఉత్సవ సమితి సభ్యులు ప్రశ్నించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో తమపై దాడి చేశారని ఆరోపిస్తూ భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రతినిధులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు.