సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం రేగోడ్ మండలం పరిధిలో ఆర్ ఇటీక్యాల గ్రామానికి చెందిన ఈడిగీ స్వప్న (32), భర్త రమేష్ గత గురువారం నారాయణఖేడ్ మండలంలోని నమిలి మేట్ గ్రామంలో జరిగిన శుభకార్యానికి హాజరై ద్విచక్ర వాహనంపై ఖేడ్ వైపు వస్తుండగా, డబుల్ బెడ్రూంల వద్దకు రాగానే ఆమె చీర కొంగు వెనుక చక్రంలో ఇరుక్కుని కిందపడి పోయింది. తీవ్ర గాయలతో సిటిజన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.