బ్యాగును చోరీ చేసిన మహిళ.. కెమెరాలో రికార్డైన దృశ్యాలు
మెదక్ జిల్లా కౌడిపల్లి వద్ద ఆర్టీసీ బస్సులో నాలుగున్నర లక్షలు చోరీ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ మహిళ బ్యాగ్ నుంచి 4. 50 లక్షలు చోరీ చేయగా.. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా మహిళ బ్యాగును చోరీ చేసినట్టు శుక్రవారం గుర్తించారు. ఆ మహిళ ఎవరో గుర్తించి పట్టుకునే పనిలో ఉన్నారు.