కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొత్తపల్లి మండలం రేకుర్తి శివారులో 13 ఏళ్ల శ్రీనిధి అనే బాలిక.. తన చెల్లితో కలిసి చెరువు వద్దకు వెళ్లింది. అక్కడ చెరువులో పడిపోయిన కుక్కను కాపాడేందుకు.. చెరువులోకి దిగిన శ్రీనిధి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. దీంతో శ్రీనిధి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.