మెదక్ జిల్లా ప్రజలకు తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం ( శ్రీ విశ్వవసు నామ సంవత్సరం) సందర్భంగా మెదక్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో అందరికీ శుభమే జరగాలని ఆకాంక్షించారు. ఈ పండుగను ఆనందంగాను, ఉత్సాహంగా జరుపుకోవాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతోను, అష్టైశ్వర్యాలతోను తులతూగాలని అభిలాషించారు.