TG: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విషాదం జరిగింది. మనస్థాపంతో షేక్ అలీబాబా (24) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సత్తుపల్లి పట్టణం మసీదు రోడ్డులో ఉండే అలీబాబా డిగ్రీ చదువుతున్నాడు. డిగ్రీలో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో మనస్థాపం చెంది ఉరివేసుకుని కొనఉరి వేసుకుని కొన్న ఊపిరితో ఉండగా.. ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.