మహా విధ్వంసం.. 1,725 మంది మృతి

54చూసినవారు
మహా విధ్వంసం..  1,725 మంది మృతి
మయన్మార్‌లో సంభవించిన భయానక భూకంపం విధ్వంసాన్ని సృష్టించింది. బహుళ అంతస్తుల భవనాలు ఎక్కడికక్కడ కుప్పకూలాయి. ఇప్పటి వరకు 1725 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. 3 వేల మందికి పైగా గాయాలైనట్లు పేర్కొన్నారు. శిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నారు. మయన్మార్​లో రిక్టర్ స్కేల్​పై అత్యధికంగా 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్