మనోహరాబాద్ మండలం గౌతాజిగూడ గ్రామంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం కుల బహిష్కరణ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకతీతంగా ప్రజలందరూ సమానం అనే భావనతో కలిసికట్టుగా ఉండాలని గ్రామంలో ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలని రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులకు భంగం కలిగించే వారికి తప్పక శిక్ష పడుతుందన్నారు.