చిన్న శంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో తాళం వేసిన రెండు ఇళ్లలో చోరీ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుంట రాజశేఖర్ సీసీఎస్ సెంటర్ కు శుక్రవారం రాత్రి తాళం వేసి వెళ్లగా, తాళం పగలగొట్టి రూ 30 వేల నగదు ఎత్తుకెళ్లాడని తెలిపారు. అలాగే కుర్మ బీరయ్య ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లగా, ఇంటి తాళం పగలగొట్టి 10 గ్రాముల బంగారం, 50 తులాల వెండి ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. శనివారం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.